Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన

Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన

 Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన


Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన



“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”

Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన

దీపారాధన అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన ఆచారం.
దీపం జ్యోతి పరంబ్రహ్మ…” అనే శ్లోకం దీపం యొక్క తాత్విక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రాధాన్యతను వివరిస్తుంది.

దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు అది ప్రాణం, జ్ఞానం, శుభం, శక్తి, లక్ష్మీ స్వరూపం.
ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగి, మనసుకు శాంతి, ఇంటికి సౌఖ్యం, ఆరోగ్యానికి మేలు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

నువ్వుల నూనె, ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి, ధ్యాన ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
సంధ్యా సమయంలో దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో దైవసన్నిధి నిలిచి ఉంటుందని విశ్వాసం.

వ్యాసంలో దీపారాధన విధానం, వత్తుల రకాలు, నూనెల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, ఆధ్యాత్మిక అర్థం వంటి అంశాలను సంపూర్ణంగా తెలుసుకోవచ్చు.

 



దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించటాన్ని దీపారాధనం అంటాం . దేవుడిని ఆరాధించటానికన్న ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్న మాట. 

ముందు దీపం వెలిగించటమే కాదు షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం దీపం నైవేద్యం అయినా తప్పవు. దీపం దేవతల ముఖమైన అగ్ని. 

అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. 

దీపం వెలిగించట మంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు. 

ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం . 

దీపాలు వెలిగించటం అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు. 

నేతి దీపాలు కావచ్చు. నూనె దీపాలు కావచ్చును. 

మన పెద్దలు దీపారాధనకు సంబంధించి ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు. 

“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే” “మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. 

పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుండి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని, ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టేప్పుడు అనుకుంటాం. 

ఎంత గొప్ప భావన! ఎంతటి ఉదాత్తమైన ఆలోచన!! పెట్టేది చిన్నదీపం. 

ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని . అంతే కాదు. నరకం నుండి రక్షింపబడాలట. మూడు వత్తులు ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం.

Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన

 


ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరు అడ్డవత్తులు బొడ్డు వత్తులు అని చేసి, ప్రమిదలో ఒక అడ్డ వత్తి, ఒక బొడ్డు వత్తి వేస్తారు ప్రత్యేకంగా ఐదు పోగులతోనూ, తొమ్మిది పోగులతోనూ, కమల వత్తులని ఎనిమిది పోగులతోనూ, ఇంక అనేక రకాల వత్తులు చేస్తారు. 

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/



అంతే కాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు. 

ఆవునెయ్యి [దేశ వాళీ] శ్రేష్ఠం. ఆవు నేతిలో పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది. 

తెల్లని గోడలు బంగారు మలాము చేసినట్టుంటాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చుని జపమైనా, పూజైనా చేస్తే ఏకాగ్రత కుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. 

దీపం వెలిగించినప్పుడు ఆ దీప శిఖలు దక్షిణా వర్తంగా, అంటే, కుడి వైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభమని నమ్మకం. 

ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేప్పుడు-విద్యుద్దీపాలు లేనప్పుడు - చేతితో దీపం పట్టుకుని చూపించుతాము కదా! అదే విధంగా దేవుడు ఉరేగేప్పుడు కాగడా పట్టుకుంటాము. 

లోకాలకి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. 

శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం. 

అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు.

 సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సంప్రదాయం. 

లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. 

అందుకే తమిళులు లక్ష్మీ పూజ దీప స్థంభానికే చేస్తారు.

 వారు మీనాక్షీ దీపాలని అమ్మవారి ప్రతిరూపం ఉన్న దీపపు కుందులను ఉపయోగిస్తారు.


సేకరణ : గూగుల్ సర్చ్ నుండి

మీ : వాగ్దేవి విజయం "


 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

Deeparadhana Lighting home healthy tips in Telugu | దీపారాధన

 

Top FAQs – తరచూ అడిగే ప్రశ్నలు (తెలుగులో)


1️ దీపారాధన ఎందుకు చేయాలి?

దీపారాధన వల్ల ఇంట్లో అశుభ శక్తులు తొలగి, శుభం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. ఇది మనసుకు ప్రశాంతతనిచ్చి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది.


2️ దీపం జ్యోతి పరంబ్రహ్మ శ్లోకం అర్థం ఏమిటి?

దీపమే పరబ్రహ్మ స్వరూపం. అది సమస్త చీకట్లను తొలగిస్తుంది. దీపం ద్వారా అన్నీ సాధ్యమవుతాయి. అటువంటి దీపలక్ష్మికి నమస్కారం అన్న భావం శ్లోకంలో ఉంది.


3️ ఇంట్లో దీపం సమయంలో వెలిగించాలి?

సూర్యాస్తమయానికి ముందు లేదా సంధ్యా సమయంలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. సూర్యోదయం వరకు దీపం వెలుగుతూ ఉంచటం సంప్రదాయం.


4️ నూనెతో దీపం వెలిగించడం మంచిది?

సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు.
అత్యుత్తమమైనది దేశీ ఆవు నేతి (గోఘృతం). ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.


5️ దీపం వత్తులు ఎన్ని ఉండాలి?

సాధారణంగా ఒకటి లేదా రెండు వత్తులు.
మూడు వత్తులు త్రిగుణాలు / త్రిలోకాలకు సూచకం.
ఐదు, ఎనిమిది, తొమ్మిది వత్తులు ప్రత్యేక పూజలలో వాడుతారు.


6️ దీపం శిఖ కుడివైపు తిరిగితే ఏమిటి?

దీప శిఖ దక్షిణావర్తంగా (కుడివైపు) తిరిగితే అది శుభ సూచకం. ఇంటికి మంచి వార్తలు, శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం.


7️ దీపారాధన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

నూనె దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, బ్యాక్టీరియా తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉండి స్ట్రెస్ తగ్గుతుంది.


8️ పిల్లలు ఉన్న ఇంట్లో దీపం వెలిగించవచ్చా?

అవును. సరైన భద్రతతో దీపం వెలిగించడం పిల్లలపై మంచి సంస్కార ప్రభావాన్ని చూపుతుంది.

 

9️ విద్యుద్దీపం బదులు నూనె దీపం ఎందుకు?

నూనె దీపం సహజ శక్తిని విడుదల చేస్తుంది. విద్యుద్దీపం కేవలం కాంతి ఇస్తే, నూనె దీపం ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది.

 

దీపారాధన అనేది కేవలం ఆచారం కాదు అది జీవన విధానం.
ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా శరీరం, మనసు, ఆత్మమూడు శుద్ధి చెందుతాయి.

 

 దీపారాధన, దీపం వెలిగించడం ప్రాముఖ్యత, Deeparadhana Telugu,

Deepam significance in Telugu

దీపం జ్యోతి పరంబ్రహ్మ అర్థం

ఇంట్లో దీపం వెలిగిస్తే లాభాలు

దీపారాధన విధానం

నువ్వుల నూనె దీపం ప్రయోజనాలు

ఆవు నేతి దీపం శుభఫలితాలు

Diya lighting home benefits

Hindu lamp lighting tradition

దీపం ఆరోగ్య ప్రయోజనాలు

Lakshmi deepam significance

Telugu spiritual tips for home

Deeparadhana lighting home healthy tips in Telugu

 


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/



Post a Comment

أحدث أقدم