Not feeling hungry aakali ga leda? beauty tips home healthy tips | ఆకలిగా లేదా..!

Not feeling hungry aakali ga leda? beauty tips home healthy tips | ఆకలిగా లేదా..!


ఆకలిగా లేకపోవడం అంటే శరీరంలో జీర్ణక్రియ సరిగా పనిచేయకపోవడమే ప్రధాన కారణం. Not feeling hungry aakali ga leda? beauty tips home healthy tips | ఆకలిగా లేదా..!  విస్తట్లో ఎన్నో రుచికరమైన పంచభక్ష్యాలు ఉన్నా ముద్ద నోట్లోకి దిగకపోతే అది ఆరోగ్యానికి హెచ్చరికే.

సాధారణంగా గ్యాస్, అజీర్ణం, వికారం, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వల్ల ఆకలి మందగిస్తుంది. అయితే ఇంట్లోనే దొరికే కొన్ని సహజ పదార్థాలతో ఆకలిని మళ్లీ పెంచుకోవచ్చు.

నిమ్మరసం, ఖర్జూరాలు, అల్లం, మెంతులు, ద్రాక్ష వంటి ఆహార పదార్థాలు జీర్ణక్రియను వేగవంతం చేసి, శరీరంలోని వ్యర్థాలను తొలగించి, సహజంగా ఆకలి పుట్టేలా చేస్తాయి.

వ్యాసంలో ఆకలి లేకపోవడానికి కారణాలు, ఇంటి చిట్కాలు, జీర్ణక్రియ మెరుగుపడే సహజ మార్గాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.

 

Not feeling hungry aakali ga leda? beauty tips home healthy tips | ఆకలిగా లేదా..!

 
ఆకలిగా లేదా..!

విస్తట్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నా కొందరికి ముద్ద నోట్లోకి దిగదు. అదేమిటంటే ఆకలిగా లేదంటారు. జీర్ణక్రియలో లోపాల వల్లే ఆకలి సరిగా ఉండదు.

చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోండి.. ఆత్మారాముడితో ఆకలి కేకలు పెట్టించండి...!

• నిమ్మరసం : 

జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి అన్నమో రామచంద్రా అనకమానరు...!

• ఖర్జూరాలు : 

పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి లేమి తీరిపోతుంది.

• అల్లం : 

వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బేషుగ్గా వేస్తుంది.

Not feeling hungry aakali ga leda? beauty tips home healthy tips | ఆకలిగా లేదా..!


 


• మెంతులు : 

పొట్టలో గ్యాస్ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.

• ద్రాక్ష :

 ద్రాక్షలో విటమిన్-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా అరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.



After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


 

 

❓ Top FAQs – తరచూ అడిగే ప్రశ్నలు (తెలుగులో)


1️ఆకలిగా లేకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

జీర్ణక్రియ లోపాలు, గ్యాస్, అజీర్ణం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది.


2️ఆకలి పెరగడానికి ఇంట్లోనే ఏమి చేయాలి?

నిమ్మరసం-తేనె నీరు, అల్లం నమలడం, ఖర్జూరాలు తినడం, మెంతిపొడి తీసుకోవడం వంటి సహజ చిట్కాలు ఆకలిని పెంచుతాయి.


3️నిమ్మరసం ఆకలిని ఎలా పెంచుతుంది?

నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి సహజంగా ఆకలి పుట్టేలా చేస్తుంది.


4️ఖర్జూరాలు తినడం వల్ల ఏమి లాభం?

ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో పాటు, జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేసి ఆకలి లేమిని తగ్గిస్తాయి.


5️అల్లం రోజూ తినవచ్చా?

అవును. రోజూ నాలుగుఐదు చిన్న అల్లం ముక్కలు నమిలితే వికారం, అజీర్ణం తగ్గి ఆకలి మెరుగవుతుంది.


6️మెంతులు గ్యాస్ సమస్యకు ఎలా ఉపయోగపడతాయి?

మెంతులు పొట్టలోని గ్యాస్‌ను బయటకు పంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీని వల్ల ఆకలి పెరుగుతుంది.


7️ద్రాక్ష తినడం వల్ల ఆకలి పెరుగుతుందా?

అవును. ద్రాక్షలోని విటమిన్-సి జీర్ణక్రియను సాఫీగా నడిపించి తీసుకున్న ఆహారం త్వరగా అరుగేలా చేస్తుంది.


8️ఆకలి లేమి ఎక్కువ రోజులు ఉంటే ఏమి చేయాలి?

ఇంటి చిట్కాలతో పాటు కూడా ఆకలి రాకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

 

 

ఆకలిగా లేకపోవడం చిన్న సమస్యలా కనిపించినా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
సరైన ఆహార అలవాట్లు, సహజ చిట్కాలు, క్రమబద్ధమైన జీవనశైలి పాటిస్తే ఆకలి కూడా బేషుగ్గా వేస్తుంది, ఆరోగ్యమూ మెరుగవుతుంది.

 

 

Not Feeling Hungry? (Aakali Ga Leda?) – Home & Healthy Tips

Not feeling hungry is mainly caused by improper functioning of the digestive system.
Even when many delicious dishes are served on the plate, if food doesn’t go down easily, it is a warning sign from the body.

Generally, problems like gas, indigestion, nausea, and mental stress reduce appetite.
However, appetite can be naturally improved using simple ingredients available at home.

Foods such as lemon juice, dates, ginger, fenugreek, and grapes speed up digestion, remove toxins from the body, and help restore natural hunger.

In this article, you can learn in detail about:

  • Causes of loss of appetite
  • Home remedies
  • Natural ways to improve digestion
  • Healthy eating habits

 

Not Feeling Hungry? (Aakali Ga Leda!)

Even when a feast with many tasty dishes is available, some people cannot swallow even a bite and say they are not hungry.
This happens mainly due to digestive problems.

Follow these small tips and awaken your appetite naturally!

 

• Lemon Juice

Lemon juice works excellently in improving digestion. It removes waste from the body and stimulates appetite.
When appetite is low, squeeze some lemon juice into a glass of water and add a little honey.
Drink it, and shortly after, you’ll feel hungry.

 

• Dates

Dates are rich in nutrients and also have strong appetite-stimulating properties.
They can be consumed directly or as juice.
Eating 4–5 dates daily helps overcome loss of appetite.

 

• Ginger

Ginger acts as a powerful remedy for nausea and indigestion.
Chew 4–5 small pieces of ginger daily and swallow the juice.
This gradually improves digestive system function and increases appetite.

 

• Fenugreek

Fenugreek helps release gas from the stomach, thereby increasing appetite.
Taking fenugreek powder mixed with honey daily in proper quantity helps stimulate hunger.

 

• Grapes

Grapes contain Vitamin C, which helps digestion function smoothly.
Eat a few grapes after meals.
Food digests faster and appetite improves.

 

 

 

1️ What are the main causes of loss of appetite?

Digestive issues, gas, indigestion, mental stress, lack of sleep, and insufficient physical activity can reduce appetite.

 

2️ What can be done at home to increase appetite?

Natural remedies like lemon-honey water, chewing ginger, eating dates, and consuming fenugreek powder help boost appetite.

 

3️ How does lemon juice increase appetite?

Lemon juice increases digestive juices and helps flush out toxins, naturally stimulating hunger.

 

4️ What are the benefits of eating dates?

Dates are nutrient-rich and stimulate the digestive system, helping reduce loss of appetite.

 

5️ Can ginger be eaten daily?

Yes. Chewing 4–5 small pieces daily reduces nausea and indigestion and improves appetite.

 

6️ How does fenugreek help with gas problems?

Fenugreek expels gas from the stomach and improves digestion, which increases appetite.

 

7️ Do grapes help increase appetite?

Yes. Vitamin C in grapes supports digestion and helps food digest faster, improving hunger.

 

8️ What should be done if loss of appetite continues for a long time?

If appetite does not improve despite home remedies, it is best to consult a doctor.

 

 

Although loss of appetite may seem like a minor problem, it should not be ignored.
With proper eating habits, natural remedies, and a disciplined lifestyle, appetite improves naturally and overall health becomes better.

 

 

 ఆకలిగా లేదా, ఆకలి లేకపోవడం, ఆకలి పెరగడానికి చిట్కాలు, జీర్ణక్రియ సమస్యలు, ఆకలి పెంచే ఆహారాలు, నిమ్మరసం ఆకలికి, ఖర్జూరాలు లాభాలు, అల్లం జీర్ణక్రియకు, మెంతులు గ్యాస్ సమస్యకు, ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు, aakali ga leda, not feeling hungry telugu tips, hunger boosting home remedies, digestion improvement tips telugu, home healthy tips telugu, beauty tips health tips telugu

 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

Post a Comment

أحدث أقدم