Tongue Secrets about health | Home Healthy Tips
Updated: August 17, 2026. This article has been refreshed for clarity, practical usefulness and current general wellness guidance. Health information can change, so check with a qualified healthcare professional for advice specific to your situation.
This guide explains Tongue Secrets about health in a clear, practical way, with key takeaways, everyday tips and answers to common questions. Use the information as general education, not as a substitute for individual medical advice.
Key Takeaways
| Topic | Tongue Secrets about health |
|---|---|
| Main focus | Healthy eating, daily habits, prevention and practical wellness |
| Best use | As general educational information for everyday healthy living |
| Safety note | Persistent, severe or unexplained symptoms should be assessed by a qualified healthcare professional |
Detailed Guide
మీ నాలుక తెలిపే 10 ఆరోగ్య రహస్యాలు.
మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు. మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు. నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి. అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది. నాలుక ఒక అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం. నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది.
1. ముదురు ఎరుపు రంగు:
• సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే విటమిన్ బి 12 లోపం ఉందని గుర్తించాలి. శరీరంలో ఎర్ర రక్తకణాలను తయారుచేయటానికి విటమిన్ B12 అవసరం. ఇది లోపిస్తే అలసట మరియు రక్తహీనత కలుగుతాయి.
• కెనడియన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన 2009 అధ్యయనంలో ముదురు ఎరుపు రంగు నాలుక ఆరంభంలో ఎరుపు మచ్చలు లేదా పాచెస్ రూపంలో కనపడుతుంది. ఒక వ్యక్తికి రక్తహీనత ఉందని చెప్పటానికి ఇది ఒక భౌతిక లక్షణంగా చెప్పవచ్చని తెలిపింది.
• ఇండియన్ నేషనల్ మెడికల్ జర్నల్ 2005 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక కవాసాకి వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటిగా తెలిపింది. రక్త నాళాలు వాచే ఈ వ్యాధి ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కనపడుతుంది.
• స్కార్లెట్ ఫీవర్ కి కూడా స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక ఒక సాధారణ లక్షణంగా ఉంది. ఈ బాక్టీరియా వ్యాధి ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయితే 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లల్లో ఈ వ్యాధి సాదారణం.
• ఇన్ఫెక్షన్ జర్నల్ లో ప్రచురించిన 2007 అధ్యయనంలో స్కార్లెట్ జ్వరంతో బాధపడుతున్న 45 మందిలో 30 మందికి నాలుక స్ట్రాబెర్రీ ఎరుపు రంగులో ఉందని తెలిపింది.
2. తెలుపు పాచెస్
• సాదారణంగా నాలుక మీద తెల్లటి రంగులో, కాటేజ్ చీజ్ లాంటి పూత పాచెస్ గా ఏర్పడుతుంది. ఇది నోటి కాన్డిడియాసిస్ వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది నోటిలో ఈస్ట్ సంక్రమణ ద్వారా కలుగుతుంది. ఇది సాదారణంగా ముసలి వారు,పసి పిల్లల్లో రోగనిరోదక శక్తి తగ్గటం వలన ఏర్పడుతుంది.
• కొన్ని రకాల మందులు ( బర్త్ కంట్రోల్ మాత్రలు మరియు యాంటీబయాటిక్స్) వాడటం వలన నాలుక మీద ఈస్ట్ ఇన్ ఫెక్షన్ రావచ్చు. దీని వలన బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, సోరియాసిస్ మరియు మధుమేహం, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నోటి కాన్డిడియాసిస్ కి సరైన చికిత్స చేస్తే నయం చేయటానికి ఎంతో కాలం పట్టదు. ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే HIV లేదా ల్యుకేమియా వంటి వ్యాధులు ఉన్నాయని గుర్తించాలి.
3. అసాదారణ మృదుత్వం
• నాలుక ఉపరితలం మీద చిన్న వెంట్రకల వంటి నిర్మాణాలు ఉండుట వలన నాలుక కరుకుగా ఉంటుంది. ఈ విధంగా మృదుత్వం కోల్పోయి కరుకుగా ఉన్న నాలుక అసాధారణంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉన్న నాలుకను కృశించిన నాలుక అంటారు. ఈ స్థితిలో నాలుక మంట మరియు నొప్పి ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి పోషక లోపంనకు సంబంధం ఉంది.
• ఓరల్ పాథాలజీ మరియు మెడిసిన్ జర్నల్ 2012 అధ్యయనంలో 176 మందిని పరిశీలించగా, వారిలో 38 మంది రక్తనాళ వ్యాధుల బారిన పడే ప్రమాదం, 47 మంది ఇనుము లోపం కలిగి ఉండటం, 39 మంది హిమోగ్లోబిన్ లోపం కలిగి ఉండటం, 13 మంది విటమిన్ బి 12 లోపం కలిగి ఉండటం, ముగ్గురు ఫోలిక్ యాసిడ్ లోపం కలిగి ఉన్నారని తెలిపింది.
4. మందపాటి, పసుపు పూత
• నాలుక మీద పసుపు పూత రావటానికి వేడి చేయటం మరియు బాక్టీరియా కారణం కావచ్చు. సంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం, ఒక ఎర్రబడిన నాలుక మీద ఒక పసుపు పూత అనేది శరీరంలో చాలా వేడి ఉందని అర్ధం.
• పశ్చిమ వైద్య ప్రకారం, నాలుక మీద ఒక మందమైన, పసుపు పూత అనేది బాక్టీరియా చర్య ఎక్కువగా ఉందని సూచిస్తుంది. నోటి పరిశుభ్రత లేకపోవటం, నోటి శ్వాస మరియు జ్వరం వంటి కారణాల వలన బాక్టీరియా ఎక్కువగా ఉందని తెలుస్తుంది.
• సాదారణంగా నాలుక మీద ఒక మందమైన, పసుపు పూత అనేది ప్రమాదకరం. అయినా దీనిని సరైన నోటి పరిశుభ్రత ద్వారా నయం చేయవచ్చు. ఇది ఒక వ్యాధికి పెద్ద సంకేతం కావచ్చు. ఈ విధమైన పరిస్థితి ఉంటే కొంత మంది గుండె రోగుల్లో స్ట్రోక్స్ ను ముందుగా గుర్తించవచ్చని తెలిసింది.
• ఇంటిగ్రేటెడ్ సాంప్రదాయ మరియు పాశ్చాత్య మెడిసిన్ చైనీస్ జర్నల్ లో ప్రచురించిన 2001 అధ్యయనంలో 378 స్ట్రోక్ రోగులను పరిశీలన చేయగా, వారిలో 214 మందికి మందపాటి మరియు జిడ్డైన పసుపు పూత ఉండటం గమనించారు. గుండె రోగుల్లో సమర్థవంతమైన రోగ నిర్ధారణ కోసం నాలుకతో ఒక అంచనాకు రావచ్చని తెలిపారు.
5. నొప్పి లేని పొక్కులు
• నాలుక మీద నొప్పి లేని పొక్కులు రెండు వారాల కన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక అది నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ చిన్న పొక్కులు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు తీసుకున్న ఆహారం మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.
• ఆస్ట్రేలియన్ డెంటల్ జర్నల్ లో ప్రచురించిన 2011 అధ్యయనంలో నాలుక ఉపరితలం మీద తెలుపు లేదా ఎరుపు పాచెస్ ఏర్పడటం అనేది నోటి క్యాన్సర్ లక్షణం అని తెలిపారు. ధూమపానం అలవాటు ఉండి ఈ లక్షణం కనపడితే మాత్రం చాలా ప్రమాదకరం.
• డెంటల్ అండ్ క్రానియోఫేసియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వారు తెలుపు గడ్డలు కంటే ఎర్రటి బొడిపెలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎర్రటి బొడిపెలు కారణంగానే క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపారు.
6. పుళ్ళు
• చిన్నగా మరియు చాలా బాధాకరముగా ఉండే నాలుక లేదా నోటి పుళ్ళను అల్సర్ అని పిలుస్తారు. సాధారణంగా ఇవి బుగ్గల లోపలి ఉపరితలంపై లేదా నాలుక కింది బాగంలో ఏర్పడతాయి. సాదారణంగా పదునైన వస్తువులు తగిలినప్పుడు లేదా అనుకోకుండా కోరికినప్పుడు పుళ్ళుగా మారతాయి. ఈ అల్సర్స్ రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉంటే ఒత్తిడి, ఆందోళన లేదా హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు.
7. పగుళ్ళు
• పగుళ్ళు అనేవి నాలుక ఉపరితలం పై ఏర్పడతాయి. ఇవి మండే అనుభూతి ఉన్నా నొప్పి మాత్రం ఉండవు. ఇది ఎక్కువగా వయస్సు ఉన్న వారిలో కనిపించే సాదారణ పరిస్థితి. అయితే ఈ పరిస్థితి వృద్ధాప్యంలో తీవ్రంగా ఉండవచ్చు. నాలుక, పగుళ్ళు అనేవి దాగి ఉన్న వ్యాధులకు సూచన కావచ్చు. నాలుక పగుళ్ళు అనేవి సోరియాసిస్ రోగులకు 6 నుండి 20 శాతం సాధారణ లక్షణంగా ఉన్నది.
8. మండే అనుభూతి
• నోటిలో ఎల్లప్పుడూ మంట అనుభూతి ఉంటే, ప్రత్యేకంగా నాలుక మీద మండే అనుభూతి ఉంటే "బర్నింగ్ నోటి సిండ్రోమ్" తో బాధ పడుతున్నారని వైద్య పరిశోదకులు అంటున్నారు. నోరు పొడిగా ఉండటం,రుచిలో మార్పు,తిమ్మిరి వంటి లక్షణాలు సాదారణంగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే నోటిలో మండే అనుభూతి ఉందని అర్ధం చేసుకోవాలి.
• ప్రివెంటివ్ మెడిసిన్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించిన 2013 అధ్యయనంలో ఈ "బర్నింగ్ నోటి సిండ్రోమ్" మొనోఫాజ్ సమయంలో సాదారణ లక్షణంగా ఉంటుందని తెలిపింది. ఇటీవలే మెనోపాజ్ దశలో ఉంటే, హార్మోన్ల అసమతుల్యత కోణం నుంచి రోగ నిర్ధారణ చేసి పరిస్థితిని చక్కదిద్దవచ్చు. అయితే అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
• రోజువారీ తీసుకొనే ఆహారంలో కొన్ని ఆహారాలు తినటం వలన అలర్జీలు రావచ్చు. అప్పుడు నోరు పొడిగా మరియు మండే నోటి రుగ్మతతో బాధపడే అవకాశం ఉంది. సున్నితమైన నాలుక మీద ప్రతికూల స్పందనకు టూత్ పేస్టు కూడా ఒక కారణం కావచ్చు.
9. నలుపు మరియు వెంట్రుకలు
• నాలుక మీద నలుపు మరియు వెంట్రుకల పరిస్థితి ఆందోళనకరమైనదని చెప్పవచ్చు. అయితే ఈ పరిస్థితికి పరిశుభ్రత మరియు జీవనశైలి పరిస్థితులు, ఆహార అలవాట్లు, ఎక్కువగా ధూమపానము మరియు నోటి పరిశుభ్రత లేకపోవటం వంటి కారణాలు అని చెప్పవచ్చు.
• 2. ధూమపానము ఎక్కువకాలం కొనసాగితే, పొగాకు అవశేషాలు కాలక్రమేణా నాలుక మీద వెంట్రుకలు మరియు నిర్దిష్ట రంగు కలిగించే సూక్ష్మజీవుల వలే ఏర్పడతాయి. bనాలుక ఎగువ ఉపరితలంలో రాపిడి లేకపోవడం వలన కూడా వెంట్రుకలు ఏర్పడటానికి కారణం కావచ్చు. సాదారణంగా మృదువైన ఆహారాలను తీసుకోవటం వలన నాలుక ఉపరితలం మీద ఉద్దీపన లేక కెరాటిన్ అనే ప్రోటీన్ వెంట్రుకలు రావటానికి కారణం అవుతుంది. కెరాటిన్ అనే ప్రోటీన్ కారణంగానే మన తల మీద వెంట్రుకలు పెరుగుతాయి.
Tongue Secrets about health | మీ నాలుక తెలిపే 10 ఆరోగ్య రహస్యాలు.
10. ఊదా రంగు
• ఊదా రంగు నాలుక అంటే ద్రాక్ష పళ్ళను బాగా చప్పరించినప్పుడు వచ్చే ఊదా రంగు నాలుక కాదు. వైద్యపరంగా ఈ ఊదా రంగు నాలుక ఎన్నో ఆరోగ్య విషయాలను బహిర్గతం చేస్తుంది. నాలుకకు రక్త ప్రసరణ సరిగ్గా లేదని సూచనగా అర్ధం చేసుకోవాలి.
• చైనీస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన 2004 అధ్యయనంలో మాములు రంగులో నాలుక ఉన్న వారితో పోలిస్తే ఊదా రంగు నాలుక ఉన్నవారిలో రక్త ప్రసరణ తక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ సూచన శరీరంలో సర్క్యులేషన్ సరిగా లేదని, బరువు పెరుగుట, ధమని వ్యాధి, రక్తం గడ్డకట్టడం మరియు మధుమేహం వ్యాధులను సూచిస్తుంది.
Tongue Secrets about health | మీ నాలుక తెలిపే 10 ఆరోగ్య రహస్యాలు.
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ?
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...!
Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu
స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention
#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu
Practical Tips
- Prefer a balanced pattern of foods rather than relying on a single ingredient or home remedy.
- Use portions, preparation methods, hydration, sleep and regular movement as part of the bigger picture.
- If a health problem is persistent, worsening, painful or associated with warning signs, seek professional medical advice rather than delaying care.
Frequently Asked Questions
What is the main focus of this Tongue Secrets about health guide?
It summarizes the main ideas in the original article and adds practical context, key takeaways and safety guidance.
Can these Tongue Secrets about health tips replace medical treatment?
No. General wellness information cannot replace a diagnosis, prescription or personalized advice from a qualified healthcare professional.
When should I seek professional advice?
Seek medical care for severe, persistent or unexplained symptoms, or whenever you are unsure whether a symptom needs evaluation.
Related Home Healthy Tips
- Fenugreek (Methi) for Men’s Health: పురుషుల ఆరోగ్యానికి మెంతుల ప్రయో
- లైంగిక ఆరోగ్యం గురించి నిజాలు: హస్తప్రయోగం, పోర్న్, నిరోధ్, థైరాయిడ్
- Stress Management Tips: ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు
More useful resources: Indian in Q8 · Free SEO Tool · Kuwait Bus Route
Disclaimer: This article is for general information and education. Health needs vary from person to person. For diagnosis, medicines, pregnancy-related concerns, urgent symptoms or ongoing conditions, consult a qualified healthcare professional.
Post a Comment