BREAKING NEWS

భూచక్రగడ్డ Bhoochakra Gadda Benefits in Telugu | Home Healthy Tips

Bhoochakra Gadda: నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో



Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి..

  •  Bhoochakra Gadda:  నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో
Bhuchakra Gadda

Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. 


కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి గిద్ద‌లూరు వ‌ర‌కూ ఉన్న ప్రాంతంలో మాత్ర‌మే భూచక్రగడ్డ దొరుకుతుంది. 


ఈ దుంపకి చెంచుల‌కూ అవినాభావ సంబంధం ఉంది. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. 


ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కనుకనే దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. . న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. 


ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెబుతారు.

భూచ‌క్ర‌గ‌డ్డ … మీట‌రు నుంచి 20 మీట‌ర్ల పొడ‌వు దాకా భూమిలో ప‌ది, ప‌న్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచ‌క్ర‌గ‌డ్డ దొరికే అవ‌కాశం వుండే ప్రాంతాల్లో ఒక ‌విధ‌మైన మ‌త్తులాంటి వాస‌న వ‌స్తుంద‌ట‌. 


ఈ వాసనను పసిగట్టే చెంచులు గ‌డ్డ కోసం వేటమొదలు పెడతారు. గ‌డ్డ ఇక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాత సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు చేసిన త‌ర్వాత త‌వ్వ‌డం మొద‌లుపెడ‌తారు. 


ఇలా తవ్వే సమయంలో ఎవరైతే ఉంటారో వారందరూ ఈ గడ్డను సమానంగా పంచుకుంటారు. 


గ‌డ్డ మొద‌లు, చివ‌ర్ల‌లో అడుగు మోయిన క‌త్తిరించి, ఎక్క‌డో ఒక‌చోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొల‌కెత్త‌దు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.



భూ చక్రగడ్డ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:



భూచ‌క్ర‌గ‌డ్డ ఎంత స‌న్న‌టి లేయ‌ర్ వుంటే అంత ఎక్కువ‌ రుచి వుంటుంది.తీపిగా వుండ‌ద‌ని పంచ‌దార చ‌ల్లి అమ్ముతుంటారు.


కానీ పంచ‌దార లేకుండా తిన‌డ‌మే మంచిది.


శరీరంలోని వేడిని త‌గ్గస్తుంది.


ర‌క్త‌విరోచ‌నాలు, క‌డుపులోప‌ల ప‌డే పుండ్ల‌ను మాన్పుతుంది.


ర‌క్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.


ఈ దుంపలను పూర్తిగా ఎవ‌రికీ అమ్మ‌రు. ముక్క‌లుగా మాత్ర‌మే అమ్ముతారు. ఇవ్వాళ్టికీ గిద్ద‌లూరు, నంద్యాల‌, క‌ర్నూలు, శ్రీ‌శైలం, అహోబిలం (ఓబులం) ప్రాంతాల్లో చెంచులే అమ్ముతుంటారు. 


అయితే ఇప్పుడిప్పుడే హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో వ్యాపారాలు అమ్మడం మొదలు పెట్టారు.




భూచక్రగడ్డ  Bhoochakra Gadda Benefits in Telugu | Home Healthy Tips

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

Bhoochakra Gadda: Bhoochakra Gadda is a tuber resembling a pillar. In colloquial language, it is also called "Magadda." It is found only in the Nallamala forest region, specifically from the vicinity of Srisailam to the Giddalur area.


This tuber is closely related to spoons. Bhoochakra Gadda is considered a symbol of luck. If one tuber is found, it can provide enough income for the entire family for at least a month, which is why it is also referred to as Lakshmi Gadda or Lachhi Gadda. The devotees of Narasimha Swami regard Bhoochakra Gadda as a blessing from the deity.


During festivals, when sold, it is referred to as "Gadda Prasadam."


Bhoochakra Gadda grows underground, reaching lengths of 20 meters and depths of 10 to 12 feet. In areas where Bhoochakra Gadda can be found, there is said to be a peculiar, intoxicating aroma.


Devotees who can identify this scent begin their hunt for the tuber. Once they accurately estimate that the tuber is located, they perform traditional prayers before starting to dig.


During the digging process, everyone present shares the tuber equally.


At both ends of the tuber, they cut it and bury it somewhere in the ground. This prevents it from sprouting but is part of their tradition.


Health Benefits of Bhoochakra Gadda:


The thinner the layer of Bhoochakra Gadda, the better the taste. It is often sold drizzled with sugar, but it is better to eat it without sugar.


It helps reduce body heat.


It alleviates ulcers around the stomach area.


It regulates sugar levels in the blood.


These tubers are not sold whole; they are only sold in pieces. Even today, spoons are sold in areas like Giddalur, Nandyal, Kurnool, Srisailam, and Ahobilam (Obulum).


However, businesses have recently begun selling them in Hyderabad and Guntur. 

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --