Vegetable Majjiga Pulusu: అమ్మమ్మ చేతి కమ్మని వంట వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం
Vegetable Majjiga Pulusu: ఆంధ్ర వంటల్లో ఫేమస్ మజ్జిగ పులుసు.. ఈజీగా పోపు వేసుకుని తయారు చేసుకోవచ్చు.. లేదా పూర్వం మన పెద్దలు తయారు చేసిన విధంగా కూరగాయలు...
Vegetable Majjiga Pulusu: ఆంధ్ర వంటల్లో ఫేమస్ మజ్జిగ పులుసు.. ఈజీగా పోపు వేసుకుని తయారు చేసుకోవచ్చు..
లేదా పూర్వం మన పెద్దలు తయారు చేసిన విధంగా కూరగాయలు వేసి.. మజ్జిగ పులుసు చేసుకోవచ్చు..
ఈ రోజు వెజిటేబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు :
మజ్జిగ
ఆనపకాయ ముక్కలు
బెండకాయ ముక్కలు
టమాటా ముక్కలు
ముల్లంగి ముక్కలు
క్యారెట్ ముక్కలు
ములక్కాయ ముక్కలు
పచ్చి మిర్చి 4
ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా
కొత్తిమీర
కర్వేపాకు
శనగపిండి
పసుపు
నూనె
ఉప్పు -రుచికి సరిపడా
పోపుకు :
ఇంగువ
ఆవాలు
అల్లం చిన్న చిన్న ముక్కలు
జీలకర్ర
మినపప్పు
శనగపప్పు
వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం:
అర లీటరు పుల్లని పెరుగు ని తీసుకుని సుమారు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి నీటిలో ఉండలు లేకుండా కలిపి మజ్జిగ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇంతలో కూరగాయ ముక్కలు అన్నిటిని ఓ గినెలో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి.
అందులో రెండు కర్వేపాకు రెమ్మలు వేసుకోవాలి.
ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి శనగపిండి కలిపినా మజ్జిగను ఆ కూరగాయ ముక్కల్లో వేసుకుని గ్యాస్ స్టౌ స్విమ్ లో పెట్టి మరగబెట్టుకోవాలి.
అలా మరగబెట్టిన తర్వాత వేరే బర్నర్ మీద గిన్నె పెట్టి.. కొంచెం నూనె వేసి.. పోపు గింజలు , ఇంగువ వేసి వేయించాలి..
తర్వాత ఈ పోపును మరుగుతున్న మజ్జిగ పులుసులో వేసుకుని కొంచెం కొత్తిమీర వేసి.. ఒక రెండు నిముషాలు మరిగించి దింపేసుకోవాలి..
అంతే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మమ్మ చేతి కమ్మని వంట కూరగాయల మజ్జిగ పులుసు రెడీ.
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ?
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...!
Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu
Post a Comment