BREAKING NEWS

Head dandruff - తల " చుండ్రు " నివారణ చర్యలు! | Home Healthy Tips

Head dandruff - తల " చుండ్రు " నివారణ చర్యలు! | Home Healthy Tips



తల " చుండ్రు " నివారణ చర్యలు : Head "dandruff" preventive measures

Head dandruff healthy tips tala lo chundru Telugu lo


ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.


వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్‌ ఆయిల్‌ను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.


తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.

వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన కొబ్బరినూనెనే వాడాలి. రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను వాడకూడదు.

ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.

చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.

చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.

తీక్షణమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. తలంటు స్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.

పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి.

తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.

వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి. వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.

పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.

మందార ఆకులు :
జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

మెంతి: 
మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.

వేపాకు:
తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

గసగసాలు:
గసగసాలు కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి

వస కొమ్ము పొడి :
కొద్దిగా వస కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు.10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి

వెనిగర్ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్ బాటిల్ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలుపుకోవాలి.
Head dandruff - తల " చుండ్రు " నివారణ చర్యలు! | Home Healthy Tips
ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది

పెరుగు, ఉసిరికాయ పొడి:
చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటి లో వేసి రాత్రి మొత్తం నానపెట్టి, ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.


అలోవెరా జెల్ ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


Head dandruff healthy tips tala lo chundru Telugu lo

Do not use other people's combs, bristles or towels. Do not give their belongings to others.

Heat warm coconut oil or olive oil once a week, apply to scalp and massage gently. After that the squash should be dipped, using the squash powder.

Bathing water should be clean. Do not use hot or smoky hot water for head baths. Only lukewarm water should be used for bathing.

Use pure coconut oil to apply to hair. Hair oils containing chemicals should not be used.

Do not use other people's blankets or pillows.

People suffering from dandruff should wear a hat or a cloth over their head when they have to stay in smoky areas.

Those who suffer from dandruff should soak their scalp in boiling water, wash it clean and dry it in the sun.  Even the scorching sun can damage the health of the hair. Instead of using shampoos and soaps for head baths, you should use coconut juice or powdered nutmeg powder.

A balanced diet should be taken to prevent malnutrition. Care should be taken not to cause insomnia.

It is advisable to clean the combs with hot water once a week, while cleaning  the head comb without accumulating dirt between the teeth. When coconut oil is applied to the scalp, it should be gently massaged with thengers.

Sweating in summer and scratching the head in the rainy season make the hairs dirty. Bathing with lukewarm water twice a week is good for hair health. Apply mint juice to the scalp and cleanse the scalp after half an hour to prevent dandruff.

Hibiscus leaves:
Hair conditioner Hibiscus leaves and ower petals are pasted and used as a natural conditioner for hair. Helps to darken hair and reduce dandruff.

Menthi: 
Menthi leaf can be crushed into a paste and applied on the scalp to reduce dandruff and dandruff. The hairs are glossy.

Hemorrhoids: 
In case of dandruff on the scalp, gently scrub the scalp and apply the paste on the scalp and bathe for 15 minutes. Bathing in that way removes dandruff and keeps the head clean.

Poppy seeds: 
Take a small amount of poppy seeds , fry them on a low ame, soak them in lukewarm water for 4 to 5 hours, apply to the scalp and leave for 1 hour.

Fat horn powder: 
Take a little fat horn powder and mix it with water and apply it on the scalp. This can cause a slight burning sensation. Bath after 10 to 15 minutes

Vinegar: 
Take a bottle of quality vinegar available in the market and mix it with six spoons of water at the rate of two spoons of vinegar.

Apply this mixture on the scalp and bathe for half an hour. Doing this once a week will cure your dandruff in just four months.

Yogurt, amaranth powder: 
For dandruff sufferers, apply a small amount of amaranth powder on the scalp and
bathe for half an hour.

Take two tablespoons of dill and soak it in water overnight. In the morning, apply the mixture on the scalp and bathe for half an hour.

Apply aloe vera gel on the scalp and bathe for an hour. Doing this during the day will remove dandruff and keep the head clean.


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --