BREAKING NEWS

అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo

అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo 


జుట్టుకు, తలకు సంబంధించి కొన్ని చిట్కాలు - అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo.

1. రెండు అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండుటేబుల్‌స్పూన్ల తేనెను అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. ఇలా చేస్తే మీ జూట్టు పట్టులా మెరుస్తుంది.

2. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.

3. ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

4. కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి

5. ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.

6. ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.

7.ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

8. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది. 

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


9. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.

10. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

11. శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.

12. జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.

13. జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.

14. తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.

15. పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

16. పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.

17. పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo 

అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo

18. బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

19. వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

20. కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నదే చాలామందిలో తలెత్తే సందేహం. మీదీ ఇదే అభిప్రాయమైతే ఇది చదవండి. ఒక్కమాట... ఈ అహార ప్రణాళిక రూపొందించుకునే ముందు మీకు రక్తహీనత, ధైరాయిడ్‌, చుండ్రు సమస్యలు ఉన్నయేమో పరీక్ష చేయించుకోవడం మేలు.

21. రక్తహీనత వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఇనుము సమృద్దిగా లభించే ఆహారం తప్పనిసరి. మాంసం, గుడ్డు, కీమా, తాజా ఆకుకూరలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్‌, గోధుమలు, ఫిగ్స్‌, ఆప్రికాట్‌ తదితరాల ద్వారా ఇనుము పుష్కలంగా అందుతుంది.

22. అన్ని రకాల నిమ్మజాతి పండ్ల ద్వారా విటమిన్‌ 'సి' సమృద్ధిగా లభిస్తుంది. ఇనుము ఆధారిత ఆహారపదార్ధాలు తీసుకుంటున్న శాకాహారులు మాత్రం వాటితోపాటు విటమిన్‌ 'సి' ఉండే వస్తువులూ తప్పనిసరిగా తీసుకోవాలి.

23. దువ్వెన, హెయిర్‌బ్రష్‌ల బ్రిసిల్స్‌ పెళుసుబారినట్లు అనిపిస్తే వాడకం ఆపేయాలి, లేదంటే వెంట్రుకలు పాడైపోతాయి. దువ్వెనలను అధిక వేడి ఉన్న హెయిర్‌ డ్రయర్‌ సమీపాన ఉంచకండి, వేడికి దువ్వెన పళ్లు దెబ్బతింటాయి.

Hair and Scalp Care Tips

  1. Take two bananas and mash them into a smooth paste. Mix in two tablespoons of honey. Apply this mixture to your hair and wash it after half an hour. This is a great solution for dry hair, making it shine like silk.

  2. To prevent hair from turning gray, mix equal parts of amla juice and sesame oil, and apply it to your scalp.

  3. In a small bowl, crack one egg and beat it well. Add the juice of one lemon and four tablespoons of yogurt to it. Apply this mixture to your scalp and leave it on for half an hour. Then wash your hair with shampoo for soft, shiny hair.

  4. Boil garlic cloves in coconut oil, strain it, and apply it to your scalp daily to turn white hair black.

  5. Soak amla powder in an iron vessel overnight. In the morning, apply this mixture to your hair using a brush. Wearing a shower cap prevents the mixture from dripping. Wash it off after an hour.

  6. Just as sunscreen is used for skin protection while going out in the sun, hair products with sunscreen can be used when you have to stay in the sun for long periods.

  7. If you’re experiencing excessive hair fall, grind one onion into a paste and mix it with a spoon of honey. Apply it to your scalp and rinse with cold water after an hour.

  8. Boil one cup of raw rice in three cups of water. Once cooked, strain the rice and let the water cool. Apply this rice water to your hair at least three times. Rinse with cold water afterward for thicker hair.

  9. Sometimes the scalp itches all over. Instead of scratching, try beetroot juice as a remedy. Cut fresh beetroot into small pieces and extract thick juice using a mixer. Apply this directly to your scalp. After half an hour, wash with warm water for shiny hair.

  10. Some people have oily hair that becomes greasy shortly after washing. If you’re considering using conditioner, opt for yogurt. Apply the conditioner only to the hair ends, not the scalp. Adding a little lemon juice to the bath water can help reduce greasiness.

  11. After drying ingredients like shikakai, peas, amla, curry leaves, lemon peels, and fenugreek, grind them separately and mix them to create a hair wash powder that helps remove greasiness, making hair shine.

  12. To grow healthy hair, it’s essential to maintain a good diet. For those who prefer long hair, a protein-rich diet is beneficial. Foods like lentils, buttermilk, eggs, legumes, chicken, and paneer provide necessary nutrients for hair growth.

  13. Even with good shampoos and conditioners, some people face issues like dandruff and hair fall. They should understand that hair care involves more than just using shampoos and conditioners; a balanced diet is also crucial.

  14. Rubbing wet hair can cause breakage and lead to split ends. It can also damage hair strands. It’s best to comb through dry hair gently to maintain its health.

  15. If you’re troubled by dandruff, it’s easy to get rid of it. Grind amla seeds into a powder and mix it with lemon juice. Apply this mixture to your scalp and wash after half an hour to eliminate dandruff.

  16. For dry hair, mix half a cup of coconut oil, coconut milk, yogurt, and the white part of one egg. Apply this mixture to your hair, leave it for 20 minutes, then rinse.

  17. If you’re struggling with dry and dull hair, take fresh fenugreek leaves and grind them finely. Mix them with thick yogurt and apply to your scalp. Wash with a good shampoo after half an hour for soft hair.

  18. For weak and thin-looking hair, it’s essential to be more mindful. Use one cup of papaya and banana pieces along with half a cup of apple pieces. Blend them together with a little water to form a smooth paste. Strain this mixture and apply the juice all over your scalp, then wash with warm water.

  19. To prevent hair fall, grind fenugreek seeds with water and apply to your scalp, rinsing after 40 minutes. Doing this every morning for at least 40 days will show excellent results.

  20. For healthy hair, a nutritious diet is vital. Many people wonder what type of food to consume. Before planning your diet, it's good to check for conditions like anemia, thyroid issues, or dandruff.

  21. Anemia can also lead to hair fall. To prevent it, a diet rich in iron is necessary. Foods like meat, eggs, fresh green vegetables, lentils, corn, millet, oats, wheat, figs, and apricots are good sources of iron.

  22. All types of citrus fruits are rich in vitamin C. Vegetarians consuming iron-based foods should also include vitamin C-rich foods in their diet.

  23. If the bristles of your comb or hairbrush feel rough, stop using them, as they can damage hair. Avoid placing brushes near high heat from hair dryers, as the heat can damage them.


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

Share this:

Post a Comment

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --