తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది.
ఉల్లిపాయ దీని గురించి ఎంత చెప్పిన తక్కువే ఎందుకంటే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. అవును ఇది నిజం ఎందుకంటే దీని వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. ముందుగా ఉల్లి ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా! మన పక్క దేశం అయిన ఇరాన్, పశ్చిమ పాకిస్థాన్ అలాగే ఉత్తర భారతదేశంలోని కొండప్రాంతాలలో పుట్టినట్టు సమాచారం. ఈ ఉల్లి చాలా పూరణాతనమైనదిగా చెపుతుంటారు. ఎందుకంటే పిరమిడ్ నిర్మించిన సమయంలో వీటిని ఆహారంగా తీసుకునేవారు అనే ఆధారాలు ఉన్నాయి. అలాగే బైబిల్, ఖురాన్‌లలో కూడా ఉల్లి ప్రస్థావన వచ్చిందని చరిత్ర చెబుతున్నట్లు పరిశీలకులు పేర్కొన్నారు.
Red Onion and Onion Rings on White Background
ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తిననవసరంలేదు మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది. అంత పవర్ ఉంది ఉల్లికి.
major benefits from onion Red Onion and Onion Rings on White Background
వెనుకటికి ఒక కథ భాగా ప్రచరంలో ఉండేది, ఇది కథ కాదు నిజం అని చాలా మంది ఇప్పటికి అంటారు. 1919 లో ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి “ఇది ఎలా సాధ్య పడింది” అని ఆ కుటుంబీకులను అడిగాడు.ఇంతలో అక్కడున్న ఒక రైతు భార్య “ఇదుగో దీని వలన” అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది.
మన ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు చూద్దాం…
ఎప్పుడైన మన పెద్దవారు మనం బయటికి వెల్లే సమయంలో ఒక ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు దానికి కారణం ఉల్లి మన శరీరానికి చల్లధనం ఇస్తుంది.
తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.
చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి.
రక్తపోటు , గుండె జబ్బులు , ఆస్తమా , అల్లెర్జి , ఇన్ఫెక్షన్ , దగ్గు , జలుబు , నిద్రలేమి , ఉబకాయము వంటి జబ్బులు రాకుండ చేస్తుంది.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.
వైరస్, బాక్టీరియాల నుండి రక్షణ :
ఉల్లి పాయలో బ్యాక్టీరియాను, వైరస్ లను ఆకర్షించే మాగ్నేట్ ఉంటుంది. దానితో బ్యాక్టీరియా ఉల్లిలో చేరిపోతుంది ఇక ఉల్లి నుండి వచ్చే వాసనతో ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. దాని వలనే ఉల్లిపై నల్లని మచ్చలాగ కనిపిస్తుంది.
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
Onion: The Benefits Are Countless!
స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention
#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu
Post a Comment