సంతాన ప్రాప్తి - క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు
రూప , గుణ, ధర్మాలు -
ఇది విస్తారంగా సుగంద పరిమళాలతో కూడిన పుష్పాలు పూస్తుంది. దీని చెక్క, కషాయం లేక చూర్ణం వగరు, చేదు రుచులతో అన్ని వ్రణాలను , క్రిమి రోగాలను , కఫ రోగాలను , జంతు విషాలను , స్త్రీల బట్టంటు రోగాలను హరించి వేస్తుంది .
* మేహా , వాత నొప్పులకు -
అశొక మాను బెరడు తెచ్చి కడిగి నానబెట్టి మెత్తగా దంచి ముద్ద చేసి దాన్ని కొంచం వెచ్చచేసి పైన వేసి కట్టు కడుతూ ఉంటే మేహా వాత నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి .
* స్త్రీల బట్టంటు రోగాలకు -
ఒక లీటరు మంచి నీటిలో అశొకమాను బెరడు 100 గ్రా నలగగొట్టి వేసి పావు లీటరు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి దించి దాన్ని రెండు బాగాలుగా చేసి ఉదయం సగం, సాయంత్రం సగం మొతాదుగా తగినంత కండచక్కెర కలిపి తాగుతుంటే స్త్రీల తెలుపు,ఎరుపు, పసుపు , నలుపు రంగులతో స్రవించే బట్టంటు వ్యాధి హరించి పొతాయి .
ఇదే కషాయాన్ని ఉపయోగిస్తుంటే యోని శూల , యోని మంట మొదలయిన యోని సమస్యలు కూడా తగ్గిపోతాయి .
* అధిక రుతురక్తానికి -
అశోక మాను బెరడు 80 గ్రా , నాటు ఆవుపాలు 80 గ్రా , మంచి నీరు 320 గ్రా తీసుకోవాలి . చెక్కని కడిగి నలగగొట్టి రసం తీయాలి . ఆ రసం , ఆవుపాలు , నీరు అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరిపొయే వరకు మరిగించి మిగిలిన కషాయాన్ని వడపోసుకొని మూడు మోతాదులుగా మూడు పూటలా కొద్దిగా పటికబెల్లం కలిపి సేవించాలి .
ఇది సేవించేప్పుడు కారం, ఉప్పు , పులుపు, మాంసం , గుడ్లు, చేపలు వంటి పదార్దాలు సేవించ కూడదు . చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తుంటే అధిక రుతురక్తం ఆగిపొతుంది. అంతే కాక గర్భాశయం లొని ఇతర సమస్యలు కూడా నివారించ బడతాయి.
గర్భం రాని వంధ్యా స్త్రీలకు ఈ కషాయ సేవన వలన గర్భశయ శుద్ది జరిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
* రక్త ప్రధరం - బహిష్టులో అధిక రక్తస్రావం కి
అశోక పూల చెట్టు రసం అర చెంచా , నాగకేసరాల పొడి అరచెంచా కలిపి ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో మెత్తగా నూరి వడపోసి అందులొ ఒక చెంచా కండచక్కెర పొడి కలిపి మూడు పూటలా సేవిస్తూ ఉంటే స్త్రీలకు ధారాపాతంగా రక్తం పొవడం ఆగిపొతుంది.
* తెల్ల బట్ట రోగానికి ప్రత్యేక యోగం -
అశోక పువ్వులు నీడలో ఎండించి దంచిన పొడి 100 గ్రా , శంఖుజీర పొడి 20 గ్రా ఎర్ర జేగురు మట్టి 20 గ్రా వీటిని పలుచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మెత్తటి పొడిలో కండ చెక్కర పొడి 200 గ్రా రోజు రెండుపూటలా పావు చెంచా పొడి చల్లటి నీటిలో సేవిస్తూ ఉంటే తెల్లబట్ట తగ్గిపొతుంది.
* స్త్రీల స్వప్న దోష నివారణకు -
బహిష్టు స్నానం తరువాత పురుషుడితో సంబోగించినట్టు స్వప్నం వస్తే ఆ స్త్రీకి మర్మావయవాలు బలహీనపడి జీర్ణశక్తి క్షీణించి పొతుంది. నడుము పట్టు తప్పి పొతుంది. మలబద్దకం కలుగుతుంది. వాయువు ఉదరంలో ప్రవేశిస్తుంది. దానివల్ల మిధ్యాగర్భం వచ్చేలా చేస్తుంది . అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించాలి.
అశోకచెట్టు పూలు , గులాబిరెక్కలు , నాగకేసరాలు ఆరేపువ్వు , పొంగించిన పటిక పొడి, శతావరి చూర్ణం , దొరగా వేయించిన సోంపు గింజలపొడి సమాన బాగాలుగా కలిపి పలచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మొత్తం చూర్ణం నకు సమంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి .
పూటకి అరచెంచా పొడి మోతాదుగా రెండుపూటలా చల్లని నీటితో సేవిస్తూ ఉంటే స్వప్నదోషం వల్ల స్త్రీలకు కలిగిన సకల అనారోగ్యాలు అంతరించిపోతాయి.
సంతాన ప్రాప్తి - క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు
* క్షయ దగ్గుకి -
అశోక చెట్టు వేరుపై బెరడుని దంచి పొడిచేసి జల్లించి నిలువచేసుకోవాలి . పూటకు 2 గ్రా మోతాదుగా ఒక కప్పు మేకపాలతో కలిపి సేవిస్తుంటే క్షయ దగ్గు తగ్గిపొతుంది.
* గర్భస్రావం కాకుండా -
అశోకపువ్వుల చూర్ణం 10 గ్రా , అశొక మాను బెరడు చూర్ణం 10 గ్రా , లోద్దుగ పట్ట చూర్ణం 10 గ్రా , గులాబిపూల చూర్ణం 10 గ్రా కలిపి నిలువ ఉంచుకోవాలి . ప్రతి మూడు గంటలకి ఒకసారి 3 గ్రా చూర్ణం చల్లని నీటితో మూడు, నాలుగు సార్లు తాగిస్తే గర్భస్రావం ఆగిపొతుంది.
* సంతాన ప్రాప్తికి - అశోక రసాయనం
అశోకచెట్టు పై బెరడు 5 కిలొల మోతాదుగా తెచ్చి కడిగి నలగ్గొట్టి దానికి 12 రెట్లు నీటిలో వేసి ఒకరోజు నానబెట్టి తరువాత నాలుగోవంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి.
తరువాత వడబోసి అందులో పాతబెల్లం పది కిలొలు , కరక్కాయ బెరడు పొడి , తానికాయ బెరడు పొడి , ఉశిరిక బెరడు పొడి, మాని పసుపు, నల్ల జీలకర్ర పొడి , తుంగ గడ్డల పొడి, శొంటి పొడి , ఎర్రచందనం పొడి, తెల్లజీలకర్ర పొడి, అడ్డసరపు ఆకుల పొడి, మామిడి జీడి పొడి, కలువరేకుల పొడి, ఒక్కొటి 50 గ్రా చొప్పున కలిపి ఆరేపువ్వుల పొడి ముప్పావు కిలొ అందులో వేసి కుండపైన మూకుడు పెట్టి గాలి పోకుండా మట్టి బట్టతో సంధి బంధనం చేసి నెలరోజులు నిలువ ఉంచాలి.
తరువాత తీసి పై తేటనీరు వడపోసుకోవాలి . ఇదే అశోక రసాయనం .పూటకు 20 గ్రా మోతాదు గా ఈ రసాయనాన్ని సేవిస్తూ ఉంటే స్త్రీల సమస్త యోని రోగాలు , గర్భారోగాలు, బహిష్టు రోగాలు హరించి సంతానప్రాప్తి కలుగుతుంది.
*********** కాళహస్తి వెంకటేశ్వరరావు ***********
సంతాన ప్రాప్తి - క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu
స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention
Post a Comment