అధిక బరువు తగ్గుతారు :
అధిక బరువు తగ్గుతారు ఉలవలను రెగ్యులర్‌గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
ఉలవకట్టు ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న 'ఉలవకట్టు'ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు ఆహారంగా తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.సెగ్గడ్డల నివారణకు ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు కలిపి దానిని పై పూత మందుగా రాస్తే బాధ తగ్గుతుంది.
లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి:
లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. అందుకే మగాడు ఉలవలను తింటే రోజూ రాత్రి ఊపేస్తాడు. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి.
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి :
ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి.
మలబద్దకం పోతుంది :
మలబద్దకం పోతుంది ఉలవలను కషాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మలబద్దకం పోతుంది. కఫం బయటకు వెళ్లిపోతుంది. స్త్రీలకు రుతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగు పడుతుంది.
కాలేయవ్యాధులతో బాధపడేవారికి ఉలవల వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగవుతుంది.ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో ఋతుసంబంధ సమస్యలు తగ్గుతాయి.ఉలవలు కాలేయవ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి. ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
ఉలవలు.. ఆరోగ్యకర ప్రయోజనాలు Ulavalu for fat stomach telugu lo health treatment
ఆకలిని పెంచుతాయి ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలను ఉలవలతో చేసిన అహారం నివారిస్తుంది మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఐరన్, కాల్షియం ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి.
ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.
మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
రక్త సరఫరా మెరుగుపడుతుంది.
మూత్రంలో మంట తగ్గుతుంది ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి.
Post a Comment